వాయిదాపడ్డ యాక్షన్ 3డి విడుదల

Action-3D-Latest-Poster-HD-

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘యాక్షన్ 3డి’. ఈ సినిమాని జూన్ 7న విడుచేయనున్నారు. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా మే 31 న విడుదలవుతుండడంతో ఈ సినిమా విడుదలని వాయిదా వేశారు. ‘యాక్షన్ 3డి’ సినిమాకి అనిల్ సుంకర నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో అల్లరి నరేష్, కిక్’ శ్యాం, వైభవ్, రాజు సుందరంలు హీరోలుగా నటిస్తున్నారు. నీలం ఉపాధ్యాయ్,కామ్న జఠ్మలాని, స్నేహ ఉల్లాల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది ఇండియాలో ఫస్ట్ 3డి కామెడీ సినిమా. ఈ సినిమాని హై టేక్నికల్స్ తో నిర్మించారు. ఈ సినిమాకి బప్పి లాహిరి ఆయన కుమారుడు బప్పా లాహిరి లు సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version