కామెడీ కింగ్ అల్లరి నరేష్ కెరీర్లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘యాక్షన్ 3డి’ సినిమా మరో వారం వెనక్కి వెళ్లి జూన్ 21న విడుదల కానుంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ నెల 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది కానీ సెన్సార్ బోర్డు ఆఫీసులో తలెత్తిన కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం మాకు ఈ సమాచారాన్ని తెలియజేసారు. ‘ మా సైడ్ నుంచి మేము రెడీ గా ఉన్నాం. కానీ సెన్సార్ బోర్డు ఆఫీసులో తలెత్తిన కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని’ తెలిపారు.
ఈ భారీ బడ్జెట్ సినిమాకి అనీల్ సుంకర దర్శకత్వం వహించి, నిర్మించాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ తో పాటు కిక్ శ్యాం, రాజు సుందరం, వైభవ్ లు కూడా కనిపించనున్న ఈ సినిమాలో స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని, నీలం ఉపాధ్యాయ్, రీతు బర్మేచ, షీన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ‘ఈగ’ సుధీప్ కనిపించనున్నాడు.
బప్పి లహరి – బప్పా లహరి కలిసి సంగీతం అందించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ, మాస్టర్ భరత్ లతో పాటు మరికొందరు కమెడియన్స్ మనల్ని తెగ నవ్వించనున్నారు.