యాక్షన్ 3డి సెకండాఫ్ లో కొన్ని పాయింట్స్ కట్

యాక్షన్ 3డి సెకండాఫ్ లో కొన్ని పాయింట్స్ కట్

Published on Jun 22, 2013 12:00 PM IST

Action-3d

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘యాక్షన్ 3డి’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ విన్న తరువాత ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాలో సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలను కట్ చేయనున్నారు. దాదాపుగా 15నిమిషాల సినిమాని వేరువేరు పాయింట్స్ లో కట్ చేశారు. ఈ రీ – ఎడిటింగ్ చేసిన సినిమా ఒరిజినల్ సినిమా కన్న బాగుంటుందని వారు బావిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కీత్ డ్రైవర్ స్టీరియోగ్రాఫర్ గా 3డి ఎఫెక్ట్ ని అందించాడు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా 2డి, 3డి ఫార్మాట్స్ లో విడుదల చేశారు. బప్పి లాహిరి సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి సన్నీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడు. కిక్ శ్యాం, రాజు సుందరం, వైభవ్, స్నేహ ఉల్లాల్, నీలం, బ్రహ్మానందం,ఎం ఎస్. నారాయణ మాస్టర్ భరత్ మొదలగు వారు ఈ సినిమాలో నటించారు.

తాజా వార్తలు