యాక్షన్ 3డి సినిమాకి వైజాగ్లో భారీ రేటు

యాక్షన్ 3డి సినిమాకి వైజాగ్లో భారీ రేటు

Published on Jan 24, 2013 1:50 PM IST

action_3d_movie

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘యాక్షన్ 3డి’ సినిమా విశాఖపట్నం ఏరియా రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. మాకు అందిన సమాచారం ప్రకారం గాయత్రీ దేవి ఫిల్మ్స్ ఈ సినిమా రైట్స్ ఒక కోటి రూపాయలకి కొనుగోలుచేసారు. ఈ ఏరియాలో అల్లరి నరేష్ కెరీర్లోనే బెస్ట్ ప్రైస్ ఇది. సమ్మర్ ఎంటర్టైనర్ గా రిలీజ్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

ఇండియాలో తెరకెక్కుతున్న ఫస్ట్ 3డి సినిమా ఇది. కిక్ శ్యాం, వైభవ్, రాజు సుందరం, స్నేహ ఉల్లాల్, నీలం ఉపాధ్యాయ్ మొదలైన తారలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి అనీల్ సుంకర దర్శకనిర్మాత. బప్పి లహరి – బప్పా లహరి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

తాజా వార్తలు