లవ్ ఫెయిల్యూర్, సెవెంత్ సెన్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన బెంగళూరు బ్యూటీ ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా పరిచయమవుతున్న సినిమా ‘సెకండ్ హ్యాండ్’. ఈ సినిమా ఈ శుక్రవారం(డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ధన్య బాలకృష్ణకి స్టార్ హీరోయిన్ కంటే మంచి యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవాలనేదే ఇష్టమంటోంది.
ధన్య తనకు ఇష్టమియన్ హీరోయిన్స్ గురించి చెబుతూ ‘శ్రీదేవి, రేవతి అంటే నాకు ఇష్టం. ఎవరన్నా శ్రీదేవి సినిమాలు రీమేక్ చేస్తే అందులో నటించాలని ఉందని’ తన మనసులోని మాటను భయటపెట్టింది. అలాగే గ్లామరస్ రోల్స్ గురించి మాట్లాడుతూ ‘ నాకు ఇలాంటి పాత్రలే చెయ్యాలని హద్దులేమీ లేవు. గ్లామర్ గా కనిపించడం అందరికీ నచ్చుతుంది కానీ అది ఎక్కడా శృతి మించ కూడదనేది నా అభిప్రాయం. గ్లామర్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయాలుంటాయి. నేను మాత్రం ఎక్కువగా పెర్ఫార్మన్స్ కి అవకాశం ఉన్న పాత్రలకే ఓటేస్తాను ఎందుకంటే నా బాడీ ఎక్స్ పోజింగ్ కి సరిపడదని’ అంటోంది.
సెకండ్ హ్యాండ్ సినిమా మంచి విజయాన్ని సాధించి ధన్య బాలకృష్ణకి మంచి గుర్తింపు, మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టాలని ఆశిద్దాం..