రికార్డు సృష్టించిన అభిమన్యు సింగ్

రికార్డు సృష్టించిన అభిమన్యు సింగ్

Published on Mar 6, 2012 2:54 AM IST

రక్త చరిత్ర చిత్రం లో బుక్కా రెడ్డిగా కనిపించిన అభిమన్యు సింగ్ బుల్లి తెర మీద ఒక ధారావాహిక లో 31 వేరు వేరు పాత్రలలో నటించి రికార్డ్ సృష్టించారు. చంద్రశేకర్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్న “ఉపనిషద్ గంగ” అనే ధారావాహిక లో ఈ రికార్డ్ సృష్టించారు. ఈ ధారావాహిక డి డి ఛానల్ లో వస్తుంది. ఒకానొక టివి కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నాకు ఆఫర్ నచ్చింది కాబట్టి చేశాను అని చెప్పారు. గత సంవత్సరం ఈ నటుడు రక్త చరిత్ర , నేను నా రాక్షసి మరియు బెజవాడ చిత్రాల లో కనిపించారు ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం లో ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు.

తాజా వార్తలు