తెలుగులో ‘ఎనీబడీ కెన్ డాన్స్’

తెలుగులో ‘ఎనీబడీ కెన్ డాన్స్’

Published on Jan 21, 2013 8:14 PM IST

ABCD
ప్రభుదేవాకి తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎనీబడీ కెన్ డాన్స్ చిత్రాన్ని తెలుగులో అనువదించనున్నారు. కొరియోగ్రాఫర్ నుండి హీరోగా ఆ తరువాత దర్శకుడిగా ఎదిగిన ప్రభుదేవా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా డైరెక్ట్ చేసారు. గతంలో తెలుగులో కొరియోగ్రాఫర్ లారెన్స్ డైరెక్షన్లో ప్రభుదేవా నటించగా స్టైల్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఒక కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేసిన సినిమాలో మరో కొరియోగ్రాఫర్ హీరోగా నటించడం విశేషం. సచిన్ సిగార్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో జనవరి నెలాఖరుకి విడుదల చేసి సినిమాని హిందీ తెలుగు భాషల్లో ఒకేసారి ఫిబ్రవరిలో చేస్తామని నిర్మాత పత్తికొండ కిషోర్ కుమార్ అన్నారు. ఈ చిత్ర తెలుగు వెర్షన్ కి శశాంక్ వెన్నెలకంటి మాటలు అందిస్తున్నాడు.

తాజా వార్తలు