స్టార్ హీరో రజినీకాంత్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఓ కేమియో పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
అయితే, తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ దహా అనే పాత్రలో నటిస్తున్నాడని.. ఆయన అల్ట్రా స్టైలిష్ లుక్తో కనిపించబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. షర్ట్ లేకుండా అమీర్ ఖాన్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నాడు. చేతిలో ఓ క్లాసిక్ సిగార్ను పట్టుకున్న అమీర్ లుక్ ప్రేక్షకుల్లో ఆయన పాత్రపై మరింత బజ్ క్రియేట్ చేస్తోంది.
ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర రోలెక్స్ తరహాలో ఉంటుందని వారు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్కు రెడీ చేస్తున్నారు.
Introducing #AamirKhan as Dahaa, from the world of #Coolie ????⚡#Coolie is all set to dominate IMAX screens worldwide from August 14th ????@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv @girishganges… pic.twitter.com/Z8pI5YJzRe
— Sun Pictures (@sunpictures) July 3, 2025