భారీ యాక్షన్ కోసం ‘ఆఖండ 2’ సన్నాహాలు !

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా జార్జియాలో జరిగింది. అయితే, వచ్చే నెల మొదటి వారంలో జరగబోయే షెడ్యూల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం బాలయ్య మరియు మిగిలిన నటీనటులతో పాటు దాదాపు వేయి మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

జూన్‌ లో మొదటి రెండు వారాలు ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. దీనికోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

Exit mobile version