ఓవర్సీస్ లో ఫెయిల్ అయిన ‘ఆహా కళ్యాణం’

ఓవర్సీస్ లో ఫెయిల్ అయిన ‘ఆహా కళ్యాణం’

Published on Feb 24, 2014 7:35 PM IST

Aaha-Kalyanam
యంగ్ హీరో నాని, వాణి కపూర్ జంటగా నటించిన సినిమా ‘ఆహా కళ్యాణం’.తెలుగు, తమిళ భాషల్లో గత శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఎ సెంటర్స్ లో పరవాలేదనిపించుకున్నా బి,సి సెంటర్స్ లో మాత్రం పెద్దగా ఆడటం లేదు. ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ఈ మూవీకి సంబందించిన ఓవర్సీస్ రిపోర్ట్ ని ట్వీట్ చేసాడు.

దాని ప్రకారం ఈ మూవీ లోకల్ కంటే ఎక్కువగా ఓవర్సీస్ లో డిజాస్టర్ గా నిలిచింది. యుఎస్ లో ఓపెనింగ్ వీకెండ్ కేవలం $1,400(రూ. 86, 871/-) మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగు వెర్షన్ తో పోల్చుకుంటే తమిళ్ వెర్షన్ కి కలెక్షన్స్ పరవాలేదనిపించాయి అలా అని సూపర్బ్ కలెక్షన్స్ అని చెప్పుకునేంత రేంజ్ లో కూడా లేవు.

‘ఆహా కళ్యాణం’ హిందీలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘బ్యాండ్ బాజా బారాత్’ కి రీమేక్. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తన బ్యానర్ ని సౌత్ లో కూడా లాంచ్ చేసారు.

తాజా వార్తలు