వారంపాటూ వాయిదాపడిన ఆగడు షూటింగ్

Mahesh_Babu

ఈ నెల 9న డా. శ్రీహరి కాలేయ సమస్యతో హఠన్మరణం తరువాత ‘ఆగడు’ సినిమాలో ఆయన పాత్రను భర్తీ చేసే నటుని ఎంపిక విషయంలో జాప్యం కారణంగా అక్టోబర్ 11 న మొదలుకావలిసిన ఈ సినిమా షూటింగ్ ఒక వారం వరకూ వాయిదాపడింది. మరోసారి కొత్తగా ముహూర్తం పెట్టి షూటింగ్ ను ప్రారంభించేందుకు బృందం యోచిస్తుంది.

ఈ సినిమా దర్శకుడు శ్రీను వైట్లకు శ్రీహరి అంటే చాలా ఇష్టం . ఆయన తీసిన ‘ఢీ’, ‘కింగ్’ సినేమాలలో పాత్రలే దానికి ఉదాహరణ. మహేష్ బాబు సరసన తొలిసారిగా తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. 14 రీల్స్ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ద్వారా భారీ నిర్మాణవిలువలతో ఈ సినిమా నిర్మాణమవుతుంది. యాక్షన్ సన్నివేశాల జోరు తగ్గకుండా కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది

Exit mobile version