ఆదితో రొమాన్స్ చేయనున్న నిషా అగర్వాల్

ఆదితో రొమాన్స్ చేయనున్న నిషా అగర్వాల్

Published on May 1, 2012 3:44 PM IST


ప్రేమ కావాలి చిత్ర విజయం తరువాత ఆది ‘లవ్లీ’ సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వడంతో మూడవ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. పిల్ల జమిందార్ సినిమాతో ఆకట్టుకున్న అశోక్ దర్శకత్వంలో ఆది తన మూడవ చేయనున్నాడు. ఈ సినిమా మొదటగా సిద్ధార్థ్ చేయాల్సి ఉండగా పలు కారణాల వాళ్ళ కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమాలో హీరొయిన్ గా కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ నటించనుంది. నిషా గతంలో ఏమైంది ఈ వేళ, సోలో చిత్రాల్లో నటించగా రెండు విజయవంతమయ్యాయి. ఇటీవలే అలియాస్ జానకి అనే సినిమా కూడా అంగీకరించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు