‘శంబాల’ టీజర్‌కు టైమ్ లాక్ చేసిన ఆది.. ఎప్పుడంటే?

‘శంబాల’ టీజర్‌కు టైమ్ లాక్ చేసిన ఆది.. ఎప్పుడంటే?

Published on Jun 7, 2025 12:30 AM IST

యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శంబాల’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి క్రియేట్ చేసింది. ‘కల్కి’ మూవీలోని శంబాల నగరం పేరు ప్రేక్షకుల్లో బాగా నోట్ అయింది. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతున్న ‘శంబాల’ మూవీ నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జూన్ 7న ఉదయం 11.32 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ అనౌన్స్‌మెంట్ చేశారు.

ఇక ఈ సినిమాను యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తుండగా అర్చన అయ్యర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు