సందీప్ సినిమాకు ఢిల్లీ అల్లర్ల సెగ…షూటింగ్ బ్రేక్

సందీప్ సినిమాకు ఢిల్లీ అల్లర్ల సెగ…షూటింగ్ బ్రేక్

Published on Mar 1, 2020 11:32 PM IST

చాల కాలం తరువాత ఢిల్లీ దారుణమైన మతఘర్షణలకు కేంద్రమైంది. కేంద్రం ప్రవేశ పెట్టిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు అనుకూల మరియు ప్రతికూల వర్గాల మధ్య జరిగిన పోరులో దాదాపు 42మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఢిల్లీలో ప్రజా జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కాగా ఈ ఢిల్లీ అల్లర్ల సెగ హీరో సందీప్ సినిమాకు తగిలింది.

సందీప్ కిషన్ హీరోగా ఏ1 ఎక్స్ ప్రెస్ పేరుతో ఓ స్పోర్ట్స్ డ్రామా తెరక్కుతున్న సంగతి తెలిసిందే. హాకీ క్రీడ ప్రధానంగా తెరక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఢిల్లీ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరపాలని నిర్ణయించారు. ఐతే ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ కి పర్మిషన్ నిరాకరించారట. దీనితో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం కి షెడ్యూల్ షిఫ్ట్ చేశారని తెలుస్తుంది. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాకు డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తుండగా , హిప్ హాప్ తమీజ్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు