యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మణిరత్నంతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మణిరత్నం ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని, ఈ సినిమాలో హీరో పాత్రకు నవీన్ పోలిశెట్టికి పర్ఫెక్ట్ గా సరిపోతుందని, ఈ క్రమంలోనే మణిరత్నం, నవీన్ ను అప్రోచ్ అయ్యారని, తన సినిమాలో నవీన్ ను హీరోగా తీసుకోవాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడట. నవీన్ పోలిశెట్టి మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
దర్శకుడిగా మణిరత్నంకు భారీ ఇమేజ్ ఉన్నా.. ఆయన గతంలో ఎవర్ గ్రీన్ సినిమాలు చేసినా.. గత కొంతకాలంగా మణిరత్నంకి సరైన హిట్ లేదు. పైగా ఆయన కథల్లో బలం ఉండటం లేదు అని విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో నవీన్ పోలిశెట్టి, మణిరత్నం సినిమా పై ఆసక్తి చూపిస్తాడా ? లేదా ? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా మణిరత్నం ‘థగ్ లైఫ్’ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రంలో శింబు కూడా నటిస్తున్నాడు. ఈ మూవీపై కోలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.