‘లెజెండ్’ రిలీజ్ కి స్పెషల్ ముహూర్తం

legend1
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియో రిలీజ్ కి స్పెషల్ ముహూర్తం ప్లాన్ చేసినట్లు ఈ సినిమా రిలీజ్ కి కూడా ఒక స్పెషల్ ముహూర్తాన్ని ఖరారు చేసారు. మార్చి 28వ తేదీన 10:34 నిమిషాలకు షో వేయనున్నారు.

ఈ విషయం తెలిసిన చాలా మంది అభిమానులు, సినీ ప్రేమికులు బెనిఫిట్ షో ఉండదేమో అని టెన్షన్ పడ్డారు కానీ బెనిఫిట్ షో ఉంటుందని మెయిన్ షో కి మాత్రమే ఆ స్పెషల్ ముహూర్తం అని ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర తెలియజేశారు.

అలాగే మరి కొద్ది సేపట్లో ఈ సినిమాకి సంబందించిన ఒక సెంటిమెంట్ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను డైరెక్టర్. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం రిలీజ్ డేట్ దగ్గర పడే సరికి ప్రమోషన్స్ భారీగా చేస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు కలిసి నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version