యూత్ కోసం స్పెషల్ ఛానెల్ గా “స్టూడియో యువ”

మన తెలుగులో ఆయా రంగాలకు సంబంధించి ఎన్నో ఛానెల్స్ ఉన్నాయి. కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పరిమితంగానే ఉన్నాయి. ఆ లోటు తీర్చేందుకు ‘స్టూడియో యువ’ పేరుతో ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అతి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

నేటి యూత్ ను టార్గెట్ గా చేసుకొని వారికోసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే లక్ష్యంగా సర్వ సన్నాహాలు చేసుకుంటున్న ఈ ఛానల్ కుర్రకారు కోరుకునే వినోదంతోపాటు విజ్ఞానం మరియు మానసిక వికాసంకు దోహదపడే విధంగా ఉంటుందని ఆ మేరకు తమ ఛానల్ ను ప్రత్యేక శ్రద్ధతో తీర్చి దిద్దుతున్నామని ‘స్టూడియా యువ’ యాజమాన్యం చెబుతోంది.

ఈ విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రసారాలు ప్రారంభించుకునే ‘స్టూడియో యువ’ అన్ని ముఖ్య సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా లభ్యం కానుంది. ఇప్పటివరకు మన తెలుగులో యువతరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఛానల్ రాలేదని, ‘స్టూడియో యువ’లో ప్రసరమయ్యే ప్రతి ప్రోగ్రాం యూత్ ని విశేషంగా అలరిస్తుందని ‘స్టూడియో యువ’ ప్రతినిధి అంటున్నారు.

Exit mobile version