లండన్ ఒలంపిక్స్ లో రెహమాన్ పాట

లండన్ ఒలంపిక్స్ లో రెహమాన్ పాట

Published on Jul 1, 2012 2:49 PM IST


రెండు ఆస్కార్ లు గెలుచుకున్న తరువాత ఏ ఆర్ రెహమాన్ ప్రపంచ ప్రసిద్దిగాంచారు. ప్రస్తుతం ఈయన మరో సారి ప్రపంచం మొత్తానికి చర్చనీయాంశం కానున్నారు. ప్రఖ్యాత లండన్ ఒలంపిక్స్ కోసం ఒక పాటను స్వరపరచనున్నారు. ఈ పాట స్వరపరచడం కోసం “స్లం డాగ్ మిలియనీర్ ” చిత్ర దర్శకుడు డాని బోయల్ తో చర్చల్లో ఉన్నారు. జూలై 27న జరిగే ఒలంపిక్స్ ప్రారంభోత్సవంలో ఈ పాటను ప్రదర్శించనున్నారు.ఈ విషయాన్నీ దృవీకరిస్తూ ఏ ఆర్ రెహమాన్ తన పేస్ బుక్ పేజ్ లో ఇలా అన్నారు ” నేను చేస్తున్న ఒలంపిక్ పాట పంజాబీ శైలిలో ఉంటుంది. లండన్లో ఇండియా కనిపించబోతుంది ఇది ఒక మెడ్లీగా ప్రదర్శితమవుతుంది. డాని బోయాల్ దీనికి సలహాలు ఇస్తున్నారు. ఇది కాకుండా 1980లో వచ్చిన కమల్ హాసన్ చిత్రం “రామ్ – లక్ష్మణ్” నుండి ఇళయరాజ స్వరపరచిన “నాంతాన్ ఉంగప్పండా” పాట కూడా ఈ ప్రారంభోత్సవంలో పాడనున్నారు.

తాజా వార్తలు