ఇప్పుడు ‘వార్ 2’ హిట్? మెయిన్ గా ఎన్టీఆర్..

ఇప్పుడు ‘వార్ 2’ హిట్? మెయిన్ గా ఎన్టీఆర్..

Published on Oct 9, 2025 12:02 PM IST

లేటెస్ట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఇండియన్ కంటెంట్ లో బాలీవుడ్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. దర్శకుడు అయాన్ ముఖర్జీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇంకా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లతో చేసిన ఈ క్రేజీ యాక్షన్ మల్టీస్టారర్ ఇప్పుడు ఓటిటిలో వచ్చాక ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ని అందుకుంటూ ఉండడం విశేషం.

ఓటిటిలో విడుదల అయ్యాక వార్ 2 కి పాజిటివ్ రెస్పాన్స్ సోషల్ మీడియాలో కనిపిస్తుండడం విశేషం. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి తమ హీరో డైనమిక్ ప్రెజెన్స్ లో పలు సాలిడ్ సీక్వెన్స్ లని షేర్ చేసుకుంటున్నారు.

అంతే కాకుండా హృతిక్ రోషన్ పై కొన్ని సన్నివేశాలు ఇంకా దర్శకుడు అయాన్ ముఖర్జీ తారక్ ని ప్రెజెంట్ చేసిన విధానం కోసం కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఓటిటిలోకి వచ్చాక మాత్రం వార్ 2 కి మంచి స్పందనే వస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

తాజా వార్తలు