సమంత ప్రస్తుతం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలా ఆనందంగావుంది. అగ్రతారల సరసన నటిస్తున్న ఈ భామ ప్రస్తుతం బిజీగా వున్న కధానాయికలలో ఒకరు. ‘నాన్ ఈ’ సాదించిన విజయంతో ఆనందంలో వున్న ఈ భామ ప్రస్తుతం ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఒకటి తెసిసింది. ఆమె విజయ్ టీవీ ద్వారా ఉత్తమ నటిగా ఎంపికయ్యింది. గౌతం మీనన్ తెరకెక్కించిన ‘నీతనే ఎన్ పోన్వసంతం’ సినిమాకుగాను నాకు ఉత్తమనటి అవార్డు రావడం చాలా ఆనందంగా వుంది. ‘నీతనే ఎన్ పోన్వసంతం’ సినిమాకు ధన్యవాదాలు. సొంతరంగంలో ప్రశంసలు రావడం ఆనందమని ట్విట్టర్లో పెర్కుంది. సూర్య సరసన లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్న ఈ భామ, పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) సినిమాలో.ఎన్.టి.ఆర్ సరసన ‘రామయ్యా వస్తావయ్యా’ లో కూడా నటిస్తుంది.