కార్తీ, కృతి శెట్టి చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!

కోలీవుడ్ టాలెంట్ హీరో కార్తీకి మన తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. మరి తాను హీరోగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “వా వాథియర్”. మంచి బజ్ ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఇది వరకే ఈ దీపావళికి లాక్ చేశారు.

అయితే ఈ సినిమా పనులు అనుకున్న విధంగా పూర్తి కాకపోయేసరికి ఈ దీపావళి రేస్ నుంచి తప్పించినట్టు అఫీషియల్ గా కొత్త డేట్ ని ఇచ్చేసారు. దీనితో ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ కి వాయిదా వేశారు. మరి డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా కొత్త పోస్టర్ తో రివీల్ చేశారు. మరి ఈ సినిమా తెలుగు రిలీజ్ మాత్రం ఉంటుందా లేదా అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది. అలాగే ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version