‘ది రాజా సాబ్’లో డబుల్ ఫీస్ట్.. మేకర్స్ నుంచి సాలిడ్ అప్డేట్!

the raja saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా ఎంతో కాలం నుంచి ప్రభాస్ సైడ్ నుంచి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే విధంగా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ది రాజా సాబ్”. వస్తున్న ఒకో అప్డేట్ తో మరింత హైప్ ని సెట్ చేసుకుంటున్న ఈ సినిమాపై మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ అందించారు.

అయితే ఈ ఉదయమే థమన్ ప్రభాస్ పై ఓ క్రేజీ డాన్స్ నెంబర్ ఉందని రివీల్ చేయగా మేకర్స్ ఒకటి కాదు రెండు చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయంటూ కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సాంగ్ తోనే నేడు కొత్త షెడ్యూల్ షూటింగ్ ని మొదలు పెట్టినట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. సో మొత్తానికి మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి రాజా సాబ్ లో ప్రభాస్ నుంచి డబుల్ డాన్స్ ఫీస్ట్ లు గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Exit mobile version