లీక్ షాక్: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి లీక్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో రెండు పాన్ ఇండియా సినిమాలు అలాగే రీజనల్ గా కూడా సాలిడ్ ఎంటర్టైనర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమానే “ఉస్తాద్ భగత్ సింగ్”. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఇప్పుడు షూటింగ్ పునః ప్రారంభం అయ్యి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే ఒక ఊహించని లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. శ్రీలీల, పవన్ పై ఆన్ సెట్స్ లో ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మరి ఇది చూసిన ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. తమకి గబ్బర్ సింగ్ మళ్ళీ తన మార్క్ యాటిట్యూడ్ తో తిరిగి వచ్చినట్టే అని అంటున్నారు. కానీ ఈ లీక్స్ మాత్రం మేకర్స్ కి తలనొప్పిగా మారాయి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version