మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు”. సాలిడ్ హైప్ ఉన్న ఈ సినిమా నుంచి ఒకో అప్డేట్ దానిని మరింత పెంచింది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కంప్లీట్ అవుతుండగా లేటెస్ట్ అప్డేట్ అయితే ఇపుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేటి నుంచే మొదలు అయ్యినట్టు తెలుస్తుంది.
నేటి మొదలు ఈ సెప్టెంబర్ 19 వరకు కొనసాగానున్నట్టుగా ఇపుడు సమాచారం. మొత్తానికి మాత్రం ఈ సినిమా ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో వెంకీ మామ కూడా కీలక పాత్ర చేస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాని రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు.