సిద్దార్థ్ కెరీర్లో 2013 చెప్పుకోదగ్గ సంవత్సరం.!

Siddharth (9)
2012లో ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాతో సక్సెస్, అలాగే విమర్శకుల ప్రశంశలు అందుకున్న సిద్దార్థ్ 2013లో వరుసగా 4 సినిమాలతో తన ఫాన్స్ ని అలరించనున్నాడు. వాటిలో ముందుగా నందిని రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ‘జబర్దస్త్’ మరియు వెట్రి మారన్ నిర్మించిన NH4 సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇవి కాకుండా సిద్దార్థ్ హిందీలో డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేసిన ‘చష్మే బదూర్’, అలాగే ఈ రోజు నుంచి సుందర్ .సి డైరెక్షన్లో ప్రారంభమైన సినిమా కూడా ఇదే సంవత్సరంలో రానున్నాయి. హన్సిక, సంతానం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ తమిళ సినిమాకి ‘తీవా వెలై సెయ్యనుం కుమారు’ అనేది టైటిల్.

ఈ సినిమాలు కాకుండా విమర్శకులు మెచ్చిన దర్శకుడు వసంతబాలన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ‘బాయ్స్’, ‘యువ’, ‘రంగ్ దే బసంతి’ సినిమాల తర్వాత సిద్దార్థ్ – ఎ.ఆర్ రెహమాన్ కాంబినేషన్లో వస్తున్న నాల్గవ సినిమా ఇది. ఇవన్నీ కాకుండా సిద్దార్థ్ తన సొంత బ్యానర్ ఎటాకి ఎంటర్టైన్మెంట్స్ పై కొన్ని సినిమాలను నిర్మించనున్నాడు.

Exit mobile version