‘వార్ 2’ నుంచి క్రేజీగా ఐమ్యాక్స్ పోస్టర్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఇంకొన్ని రోజుల్లో థియేటర్స్ లో పడిపోనుంది. దీనితో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఒకో పోస్టర్ మరిన్ని అంచనాలు సెట్ చేస్తున్నాయని చెప్పాలి.

ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ నడుమ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లా కనిపిస్తున్న ఈ ఐమ్యాక్స్ పోస్టర్ మంచి ఇంటెన్స్ గా కనిపిస్తుంది. దీనితో ఫ్యాన్స్ ఈ సినిమా ఐమ్యాక్స్ వెర్షన్ లో చూసేందుకు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో కియార అద్వానీ హృతిక్ సరసన హీరోయిన్ గా నటించగా యష్ రాజ్ ఫిల్మ్స్ తమ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించారు. ఈ ఆగస్ట్ 14న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

Exit mobile version