‘కుబేర’ ట్రైలర్ పై ఒక క్లారిటీ!

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా మన టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒక కీలక పాత్రలో రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే “కుబేర”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన కంటెంట్ అంతా కూడా మంచి బజ్ ని రేకెత్తించడంతో ట్రైలర్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి.

మరి ఈ ట్రైలర్ ఈ జూన్ 13నే రావాల్సి ఉంది కానీ వాయిదా వేశారు. కానీ డేట్ ఏంటి టైం లాంటివి అనౌన్స్ చేయలేదు. కానీ ఫైనల్ గా రేపు జూన్ 15న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచే ఈ ట్రైలర్ వస్తుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. తమ టీం అంతా మంచి ట్రీట్ ఇచ్చేందుకే శ్రమిస్తున్నారని కుబేర మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. మరి ఈ చిత్రం రానున్న వారం జూన్ 20 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version