శేఖర్ కమ్ముల అంత పెద్ద సవాలును స్వీకరించనున్నడా?

శేఖర్ కమ్ముల అంత పెద్ద సవాలును స్వీకరించనున్నడా?

Published on May 3, 2013 1:05 PM IST

Shekhar-Kammula
శేఖర్ కమ్ముల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘అనామిక’ సినిమా రూపంలో తనకు ఒక పెద్ద సవాలు ఎదురైంది. ఈ సినిమా హిందీలో విడుదలైన ‘కహాని’ సినిమాకు రీమేక్. అక్కడ విద్యాబాలన్ పోషించిన పాత్రను తెలుగులో నయనతార పోషించనుంది. సమాచారం ప్రకారం ఈ సినిమాను దర్శక నిర్మాతలు 50రోజులలో పుర్తిచేద్దాం అనుకున్నారంట. ఇదేగనుక నిజమైతే శేఖర్ కమ్ముల కెరీర్లో ఇదొక రికార్డుగా నిలిచిపోతుంది. ఎందుకంటే గత ఏడాది అతను తీసిన ‘లైఫ్ ఈస్ బ్యూటిఫుల్’ సినిమా షూటింగ్ సంవత్సరానికి పైగానే జరుపుకున్నారు. లీడర్ సినిమా కుడా తెరపైకి రావడానికి ఎక్కువ సమయమే పట్టింది. ఈ ‘అనామిక’ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఓల్డ్ సిటీని తలపించే భారీ సెట్ కుడా వేసారు. ఈ సినిమాను ఎండెమోల్ ఇండియా, లొంగ్లిన్ ప్రొడక్షన్స్ మరియు సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

తాజా వార్తలు