‘గులేబకావళి’ కథ (1962) లోని ‘నన్ను దోచుకుందువటే’ పాట నుండి ‘అరుంధతి’ లో ‘జేజమ్మ’ పాట వరకు ఆయన ప్రస్థానం సాగింది. ఇంతకాలం తెలుగులో గేయ రచయితగా సాగించిన ఆయన మరెవరో కాదు సి. నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి గారు సినారే పేరుతో పాటలు రాసేవారు. 1962 లో ‘ఆత్మ బందువు’ మొదటి చిత్రం చేసిన ఆయన 50 వసంతాలు పూర్తిచేసుకున్నారు. ఆయన తెలుగు భాషలో 3000 పైగా పాటలు రాసారు. ఆయన కీర్తిశేషులు నందమూరి తారకరామారావు గారికి మంచి స్న్హేహితుడు. అలాగే నారాయణ రెడ్డి గారు మల్లెమాల సుందరరామిరెడ్డి గారితో కూడా చాలా దగ్గరి స్నేహం ఉంది. జూలై 29 1931 లో కరీంనగర్ జిల్లాలో సింగిరెడ్డి నారాయణ రెడ్డిగా జన్మించిన ఆయన తెలుగు భాషపై ఎంతో మక్కువ పెంచుకున్నారు. 1997 లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన 1992 లో పద్మ భూషణ్ అందుకున్నారు. అలగే విశ్వంభర పుస్తకం రాసినందుకు గాను జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. ఆయన మూడు తరాలకు సాహిత్యం అందించారు.
ఈ గొప్ప సందర్భంగా 123తెలుగు.కాం తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.