శ్రీ రామరాజ్యానికి 50 రోజులు

శ్రీ రామరాజ్యానికి 50 రోజులు

Published on Jan 5, 2012 12:10 PM IST


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకునే సినిమా ‘శ్రీ రామరాజ్యం’. ఎటువంటి మసాలా ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ అంశాలు లేకుండా సినిమా తీసి విజయం సాధించారు దర్శక నిర్మాతలు. సుప్రసిద్ధ దర్శకుడు బాపు గారు తనదైన శైలిలో రామరాజ్యాన్ని తీర్చిదిద్ది ప్రేక్షకులకు కానుకగా అందించారు. ప్రతి ఫ్రేము తన కుంచెతో అద్దినట్లుగా, వస్త్రాభరణాలు కూడా అందంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో సీత కష్టాన్ని చూసిన వారు కంటి తడి పెట్టక మానరు.

రాముడిగా బాలకృష్ణ అధ్బుత నటన ప్రదర్శించగా సీతగా నయనతార తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. తన కెరీర్లోనే అత్యుత్తమ నటన కనబరిచింది. ఇళయరాజా గారి వినసొంపైన పాటలు మరియు అధ్బుత నేపధ్య సంగీతం చిత్ర విజయానికి దోహద పడ్డాయి. ఈ చిత్రం ఈ రోజుతో విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా 50 రోజుల వేడుకను శిల్ప కళా వేదికలో ఘనంగా చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు