35 అడుగుల ప్రభాస్ కటౌట్.. ప్రసాద్స్ దగ్గర ‘రాజా సాబ్’ టీజర్ లాంచ్ హంగామా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ముందుగా టీజర్ ని దింపనున్నారు. ఈ జూన్ 16న గ్రాండ్ గా లాంచ్ చేస్తుండగా ఈ ఈవెంట్ ని హైదరాబాద్ ప్రసాద్స్ లో గ్రాండ్ గా చేస్తున్నారు.

అయితే అక్కడ ప్రభాస్ ది రాజా సాబ్ పై 35 అడుగుల స్పెషల్ కటౌట్ ని పెడుతున్నారట. దీనితో ఆ టీజర్ లాంచ్ రోజు రచ్చ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. ఫ్యాన్స్ ఈ బిగ్ డే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టీజర్ లాంచ్ టైం ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version