ధనుష్ మరియు శ్రియ ప్రధాన పాత్రలలో కనిపించబోతున్న చిత్రం “3”. ఈ చిత్రాన్ని ఒక్క ఆంద్ర ప్రదేశ్ లో మాత్రమే 700 థియేటర్లలో విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్ర అనువాద హక్కులను కొనుక్కున నట్టి కుమార్ ఆకర్షణీయమయిన ధరకు కొనుక్కునట్టు తెలుస్తుంది.”ఈ నెల 30న ఆంద్ర ప్రదేశ్ లో ఈ చిత్రాన్ని ఏడు వందల థియేటర్లకు పైగా విడుదల చేయ్యనున్నామని తెలుగు ఒక పెద్ద హీరో చిత్రం స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు. యువత ఈ చిత్రాన్ని ఆదరిస్తారని, 21 ఏళ్ళ అనిరుధ్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందిది అని, మార్చ్ 29న చిత్ర ప్రీమియర్ షో వెయ్యనున్నం అని చిత్ర బృందం మొత్తం దానికి హాజరు అవుతారని అనుకుంటున్నా” అని నట్టి కుమార్ పాత్రికేయులతో చెప్పారు. ఈ చిత్ర విడుదల ఆపడానికి కొంతమంది ప్రయత్నించారని కూడా చెప్పారు.” మా దగ్గర దక్షణ భారత ఫిలిం చాంబర్ ఆమోదం ఉందని ఆర్ కే ప్రొడక్షన్స్ “3” టైటిల్ ని రిజిస్టర్ చేసుకొని విడుదల సమయంలో సమస్యలు సృష్టించాలని చూసిందని, ప్రస్తుతం ఎటువంటి సమస్యలు లేవు” అని నట్టి కుమార్ తెలిపారు. ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమ కథా చిత్రం. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.