12 మంది దర్శకుల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుట్టినరోజు సినిమా

puttina-roju-telugu-movie

12 మంది దర్శకుల దర్శకత్వంలో.. 12 మంది కెమెరామెన్ ల ఛాయాగ్రహణంతో.. 12 మంది నటుల ప్రధాన పాత్రలతో ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది. ‘పుట్టినరోజు’ అనే టైటిల్ తో వినూత్న కధనంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఒక పన్నెండు మంది ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకూ వారి పుట్టిన రోజుని ఎలా జరుపుకున్నారు అన్నది కధాంశం. ఈ సినిమా ప్రయత్నం ఇప్పటికే ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్తానాన్నిసొంతం చేసుకుంది. ఈ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి

Exit mobile version