‘రౌడీ’లో 11 నిమిషాల హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్

rowdy
సినిమాల్లో కామెడీ, సెంటి మెంట్, సాంగ్స్ కి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత యాక్షన్ ఎపిసోడ్స్ కి కూడా ఉంది. మాములుగా యాక్షన్ సీక్వెన్స్ అంటే సందర్భాన్ని బట్టి 3 – 6 నిమిషాలు ఉంటుంది. వాటన్నిటినీ రూపు మాపేలా విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన రాబోయే ‘రౌడీ’ సినిమాలో 11 నిమిషాలు సాగే ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు.

డా. మోహన్ బాబు, మంచు విష్ణు పాల్గొనే ఈ 11 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఎక్కువ ఖర్చు పెట్టి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రిచ్ గా షూట్ చేసిన ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇప్పటి వరకూ ఎలాంటి సినిమాలో రాలేదని ఈ చిత్ర టీం అంటోంది. ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్ తన కెరీర్లో ఎప్పుడూ చెయ్యలేదని, ఈ క్రిడిట్ అంతా వర్మకే చెందుతుందని విష్ణు అన్నాడు.

ఇప్పటికే ట్రైలర్ లో మోహన్ బాబు చెప్పిన డైలాగ్స్, అతని డైలాగ్ డెలివరీకి అలాగే మంచు విష్ణు పెర్ఫార్మన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జయసుధ, శాన్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

Exit mobile version