డేటింగ్ నేపధ్యంలో రానున్న 101ఏ


భాను, మధురిమ జంటగా ‘101ఎ’ పేరుతో ఓ చిత్రం మొదలయింది. జేఎస్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ కనకదుర్గ ప్రొడక్షన్స్ పతాకం పై రవిచావన్, జేఎస్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విజయేందర్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇచ్చారు. డేటింగ్ కి ఆకర్షితులయిన ఒక జంట ఫాం హౌస్ కి వెళ్ళాక అక్కడ ఎదుర్కున్న సంఘటనలే ఈ చిత్రం అని దర్శకుడు జే ఎస్ కుమార్ చెప్పారు. శ్రీ వెంకట్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు

Exit mobile version