కనీవినీ ఎరుగని రీతిలో ఇండియన్ మూవీ 100 ఏళ్ళ పండుగ

కనీవినీ ఎరుగని రీతిలో ఇండియన్ మూవీ 100 ఏళ్ళ పండుగ

Published on Jul 1, 2013 10:56 AM IST

100yrsofcinemaభారతీయ సినీ పరిశ్రమకు వందేళ్ళు నిండిన సందర్భంగా సెప్టెంబర్ 1,2,3 తేదిలలో దక్షిణ సినిమాలకు జన్మస్థానం అయిన చెన్నైలో చాలా గ్రాండ్ గా సంబరాలు జరుపనున్నారు. మొదటి రెండు రోజులు తెలుగు తమిళ, కన్నడ ఇండస్ట్రీలోని ప్రముఖులకు సన్మానం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి. చివరి మూడవ రోజు 18భాషలకు చెందిన ప్రముఖులు, నటులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య పండుగను నిర్వహిస్తాం అని దక్షిణాది చలన చిత్ర వాణిజ్య మండలి అద్యక్షుడు సి. కళ్యాణ్ తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమం చివరి రోజున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ని కూడా ఆహ్వానించినట్టు వారు తెలుయజేశారు.

వందేళ్ళ భారతీయ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనే భావనని పోగొట్టడానికి, మన తెలుగు సినిమాకి గల ప్రాముఖ్యతను వివరించడానికి హైదరాబాద్లో ఆగష్టు చివరి వారంలో దీనిపై సెమినార్లు, ప్రదర్శనలు చేయనున్నట్లు తమ్మారెడ్డి భరద్వాజ తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగే తెలుగు సినిమా కార్యక్రమాలకు ఆయన అద్యక్షత వహించనున్నాడు.ఈ కార్యక్రమం జరిగే మూడు రోజులు అన్ని నిర్మాణ సంస్థలకు సెలవు ఉంటుందని 75సంవత్సరాల తెలుగు సినిమా ఉత్సవాల కంటే గ్రాండ్ గా వీటిని నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు.

తాజా వార్తలు