హైదరాబాద్లో జరగనున్న నూరేళ్ళ సినీ సంబరాలు

హైదరాబాద్లో జరగనున్న నూరేళ్ళ సినీ సంబరాలు

Published on May 21, 2013 6:45 PM IST

tammareddy
భారతీయ చలన చిత్ర పరిశ్రమకు వందేళ్లు నిండిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వందేళ్ళ సినీ ప్రస్థానానికి గుర్తుగా టాలీవుడ్ హైదరాబాద్లోనే ఘనంగా వేడుకలు నిర్వహించబోతోంది. ఈ వేడుకల్లో 19 భాషలకు చెందిన కళాకారులు పాల్గొననున్నారు. ఈ రోజు ఈ విషయంపై జరిగిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్లో ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 19 భాషలకు చెందినా కళాకారులతో హైదరాబాద్లో ఓ వేడుకను నిర్వహించానున్నాం. ఈ వేడుకలో భారతీయ సినిమా చారిత్రక ఆధారాలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకోసం అభిమానులు, ప్రేక్షకులు, ప్రజలు సహకరించాలని’ ఆయన కోరారు.

హైదరాబాద్ లో నిర్వహించిన ఆనంతరం చెన్నైలో ఈ వందేళ్ల ఉత్సావాలు జరుగుతాయి. ఈ సందర్భంగా బుధవారం నుంచి ఆరు రోజుల పాటు హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఆవరణలోని రామానాయుడు కల్యాణ మండపంలో సురభి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నారు.

తాజా వార్తలు