1000 అబద్ధాలు విడుదల తేది ఖరారు

1000 అబద్ధాలు విడుదల తేది ఖరారు

Published on Jul 26, 2013 1:50 PM IST

1000_abaddalu_movie_wallpap
సాయిరాం శంకర్, ఏస్తర్ నటించిన ‘1000 అబద్ధాలు’ సినిమా ఆగష్టు మధ్యలో మనముందుకురానుంది. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రభాకర్ నిర్మిస్తున్నాడు. చాలా రోజులనుండి విడుదల జాప్యం అవుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ఆగష్టు 15న విడుదలకానుంది. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విజయంపై చిత్ర బృందం చాలా నమ్మకంగా వున్నారు. ఈ సినిమా గురించి తేజ మాట్లాడుతూ “సినిమాకు నాగబాబు పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు పెద్ద ఫ్యాన్ గా టవర్ స్టార్ రూపంలో కనిపిస్తాడు. ఈ సినిమా ప్రతీ వర్గం ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది, నవ్వు తెప్పిస్తుందని ” తెలిపాడు. రమణ గోగుల సంగీత దర్శకుడు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు