నేటి రాత్రికి బయలు దేరనున్న ‘1’ యుఎస్ ప్రింట్స్

నేటి రాత్రికి బయలు దేరనున్న ‘1’ యుఎస్ ప్రింట్స్

Published on Jan 8, 2014 11:50 AM IST

1_Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అలాగే ఓవర్సీస్ లోని తెలుగు వారు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తుండడం, దాంతో ఓవర్సీస్ లో కూడా బాగా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతుండడంతో మహేష్ బాబు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు.

యుఎస్ కి వెళ్ళాల్సిన ఈ సినిమా ప్రింట్స్ ఈ రోజు రాత్రి బయలుదేరనున్నాయి. అలాగే అనుకున్న టైం కి అన్ని ప్రదేశాలకు ప్రింట్ చేరుతుందని వారు ఆశిస్తున్నారు. అలాగే మిగిలిన ప్రేదేశాలకు వెళ్ళాల్సిన ప్రింట్స్ కూడా బయలుదేరాయి.

మహేష్ బాబు – కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

తాజా వార్తలు