శరవేగంగా జరుగుతున్న ‘1’ పోస్ట్ ప్రొడక్షన్

1-Nenokkadine-Movie-New-Tra
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ చిత్ర టీం అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చెయ్యాలని 24 గంటలు కష్టపడుతున్నారు.

ఈ సినిమా రైట్స్ ని బాలీవుడ్ లో బాగా పేరున్న ఈరోస్ వారు కొనుక్కున్నారని ఇది వరకే తెలియజేశాం. వారు ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో మహేష్ బాబు సరసన కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

Exit mobile version