న్యూ రికార్డ్ సృష్టించిన మహేష్ బాబు ‘1-నేనొక్కడినే’ ఫస్ట్ లుక్

mahesh-Nenokkadine

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘1-నేనొక్కడినే’. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ కి మంచి స్పందన అబించింది. ఈ ట్రైలర్ ని నెట్ లో రికార్డ్ స్థాయిలో దాదాపు గా 1 మిలియన్ మంది పైగా చూడటం జరిగింది. మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమాకి సంబంధించి న్యూ షెడ్యూల్ ఈ నెల 18 నుండి లోలండన్ లో జరగనుంది. దాదాపు 60లు జరిగే ఈ షెడ్యూల్ లో ఈ సినిమాకి సంబందించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

టీసర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version