సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ‘1-నేనొక్కడినే’ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. దాంతో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు రాత్రి 7 గంటలకు ఈ సినిమాకి సంబందించిన ఓక ఆప్ ని రిలీజ్ చేయనున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ఈ ఆప్ కేవలం ఆండ్రాయిడ్ మొబైల్ యూసర్స్ కి మాత్రం అందుబాటులో ఉంటుంది. మరో 11 రోజుల తర్వాత ఐఓఎస్ వెర్షన్ అందుబాటులోకి వస్తుంది.
ఆ ఆప్ లో సినిమాకి సంబందించిన ఫోటోలు, పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ మరియు సినిమా విశేషాలు ఉంటాయి అలాగే ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
మహేష్ బాబు – కృతి సనన్ జంటగా నటిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సుకుమార్ డైరెక్టర్. 14 రీల్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఈ ఆడియోని ఈ నెల 19న ఘనంగా రిలీజ్ చేయనున్నారు.