ఇండియన్ ఐడల్ గా నిలిచిన శ్రీ రామచంద్ర టాలీవుడ్ లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీరామ్ ఇప్పటికే ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో ముఖ్య పాత్రను పోషించాడు.
ప్రస్తుతం అతను సింగల్ హీరోగా ‘ప్రేమ గీమా జాంతానై’ అనే సినిమాలో నటిస్తున్నాడు. బార్బీ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయంకానుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల వేడుక శిల్పారామంలో ఘనంగా నిర్వహించాలని అనుకున్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న గొడవల నేపధ్యంలో ఈ సినిమా ఆడియోను వాయిదా వేశారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ముగించుకుని ప్రస్తుతం నిర్మానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్నాయి. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. సుబ్బు ఆర్.వి దర్శకుడిగా పరిచయంకానున్నాడు. ఈ సినిమాను శుభం క్రియేషన్స్ బేనర్ పై మద్ధల భాస్కర్ మరియు బాలా భాస్కర్ నిర్మిస్తున్నాడు.