ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ మరియు అందం ఉన్న తారలలో కట్రి కైఫ్ ఒకరు. ఆమెకు భారత దేశం లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. మొన్న ‘షీలా కి జవాని’ ఐటెం సాంగ్ లో తళుక్కు మనిపించిన కత్రినా తాజాగా ‘చిక్ని చమేలి’ అనే పాట తో యువతను ఉర్రూతలూగిస్తోంది.
మన తెలుగు నిర్మాతలు కొందరు ఈమెతో మన చిత్రాలలో ఐటెం సాంగ్ చేయాలని ఆశపడి, ఒక్క పాట కి కోటి రూపాయలు ఇస్తాము అని చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. కారణం ఏమిటంటే ఆమెకు తెలుగు లో ఉన్న ‘మల్లీశ్వరి’ ఇమేజ్ పాడు చేసుకోవటం ఇష్టం లేదు అట . ఆమెకు ఇమేజ్ డ్యామేజి ఇబ్బందో మరేదైనా ఇబ్బంది ఉందో ఆమెకే తెలియాలి. ప్రస్తుతానికి మాత్రం మన యువ కుర్ర హీరోలకు ఆమె తో జత కట్టే అవకాసం లేనట్టే.