యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమా 11రోజులకి నైజాం ఏరియాలో అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. నిన్నటి వరకూ ఈ సినిమా సుమారు 11.10 కోట్ల షేర్ సంపాదించింది. అలాగే వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఈ సినిమా నైజాం లాంగ్ రన్లో మొత్తంగా 15 -16 కోట్ల షేర్ సంపాదిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ప్రభాస్ సరసన అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచాడు. పల్నాడు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. ప్రభాస్ కి మంచి స్నేహితులైన వంశీ – ప్రమోద్ ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిచారు.