ప్రత్యేక ఇంటర్వ్యూ : కిరీటి – టాలీవుడ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దొరకడం ఓ అదృష్టం.

ప్రత్యేక ఇంటర్వ్యూ : కిరీటి – టాలీవుడ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దొరకడం ఓ అదృష్టం.

Published on Dec 12, 2013 5:00 PM IST

Kireeti
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్న కొత్త నటుడు కిరీటి దామరాజు. స్వతహాగా ఇంజనీర్ అయిన కిరీటి ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్ సర్క్యూట్ లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న కిరీటి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై ‘సెకండ్ హ్యాండ్’ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షంచుకోనున్నాడు. ఈ సందర్భంగా కిరీటితో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. కిరీటి ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి, అలాగే తను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎంత పెద్ద అభిమాని అనేది మాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు మీకోసం…

ప్రశ్న) మొదటగా మీ గురించి కాస్త చెప్పండి. అలాగే యాక్టింగ్ అనే ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు?

స) మా సొంత ఊరు గుంటూరు కానీ నేను హైదరాబాద్ లోనే పెరిగాను. నా చిన్నతనం నుంచి సినిమాలు బాగా ఎక్కువగా చూసేవాడిని. నా ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత సినిమాల్లో ఏదో ఒకటి చెయ్యాలని బలంగా నిర్ణయించుకున్నాను. అందుకే నేను ట్రెడిషనల్ ఫిల్మ్ రూట్ ని ఎంచుకున్నాను. నాకు థియేటర్ ప్రోగ్రామ్స్ అంటే బాగా ఇష్టం ఎందుకంటే అక్కడ మనకు ఎవరూ ప్రామ్టింగ్ చెప్పరు, సపోర్ట్ ఇవ్వరు, అలాగే కట్ అనేది లేకుండా నటిస్తూ ఉండాలి. అప్పుడే బెంగుళూరులో ఎక్కువ థియేటర్ షోస్ జరుగుతాయని, అక్కడ వీటిని బాగా ఎంకరేజ్ చేస్తారని తెలుసుకున్నాను. మల్టీ నేషనల్ కంపీనీలో నా ఐదు రోజుల వర్క్ పూర్తయాక వీకెండ్స్ లో అన్ని రకాల థియేటర్ షోస్ కి వెళ్ళేవాడిని. అక్కడే నేను నటనలో బేసిక్స్ నేర్చుకున్నాను.

ఆ తర్వాత కొద్ది రోజులకి నటుడిగా మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతో ఇండియాలోనే థియేటర్ షౌస్ చెయ్యడంలో ప్రసిద్ది చెందిన ఆదిశక్తి గ్రూప్ లో జాయిన్ అయ్యాను. అక్కడే నేను నటనలో మరికొన్ని మెళకువలు నేర్చుకున్నాను. వాళ్ళు నాకు కళ్ళతో పలికించాల్సిన భావాలను, కలరిపయట్టు మొదలైనవి నేర్పించారు.

అవన్నీ నేర్చుకున్న తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాను. ‘ఒంటరిగా’, ‘అనుకోకుండా’ అనే షార్ట్ ఫిల్మ్స్ బాగా గుర్తింపు తెచ్చాయి. ‘అనుకోకుండా’ చూసి చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు మెచ్చుకున్నారు. అలాగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళిన మొట్ట మొదటి తెలుగు షార్ట్ ఫిల్మ్ అదే..

ప్రశ్న) సెకండ్ హ్యాండ్ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?

స) సెకండ్ హ్యాండ్ సినిమాకి పనిచేసిన కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి సుబ్బారావు పాత్రకి నేనైతే బాగుంటానని అనుకున్నారు. దాంతో నన్ను పిలిచి డైరెక్టర్ కథ చెప్పారు. నేను వెంటనే ఓకే చెప్పాను. ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలో ఎంతో ఫ్రెష్ నెస్ కనపడింది.

ప్రశ్న) ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో మీరు హ్యాపీగా ఉన్నారా?

స) సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటికైతే కిషోర్ తిరుమల సినిమాని చాలా బాగా తీసాడు. ఈ చిత్ర టెక్నికల్ టీం షూటింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేసారు. ఎప్పుడైతే టెక్నికల్ టీం బాగా ఎంజాయ్ చేస్తుందో అప్పుడు ఆ సినిమా అవుట్ పుట్ బాగా వస్తుంది.

ప్రశ్న) సినీ ఇండస్ట్రీలో మీ రోల్ మోడల్ ఎవరు? మీకు అత్యధికంగా స్ఫూర్తి నిచ్చిన వ్యక్తి ఎవరు?

స) నాకు జంధ్యాల గారి పనితనం అంటే చాలా ఇష్టం. నాకు కూడా సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్ గారిలా పలు రకాల కామెడీ సినిమాలు చేయాలని ఉంది. కొద్ది రోజుల తర్వాత నిర్మాతలు మరియు దర్శకులు నాకోసం కొన్ని ప్రత్యేక పాత్రలు క్రియేట్ చేస్తే నేను సక్సెస్ సాధించానని అనుకుంటాను. నాకంటూ ఓ ప్రత్యేకతని క్రియేట్ చేసుకోవాలి. ‘ఈ పాత్ర కిరీటి కంటే ఎవరూ బాగా చెయ్యలేరు అనే టాక్ వస్తే చాలు’.

ప్రశ్న) మీ ఈ కెరీర్ కి ఎవరు హెల్ప్ చేసారు?

స) నేను సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ ఫార్మ్స్ లో ఎక్కువగా ఉంటాను. అక్కడ నాకు ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు నాకు ఎంతో హెల్ప్ చేసారు. సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ ఫార్మ్ అనేది చాలా పవర్ఫుల్ మీరు దానిని సరిగా వినియోగించుకుంటే మీరు అనుకున్నది సాధించగలరు. నేను ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చాను. కావున ఇండస్ట్రీలో నాకు సపోర్ట్ ఇచ్చేవారు ఎవరూ లేరు.

ప్రశ్న) ఇప్పటివరకూ మీ జర్నీ హ్యాపీగానే ఉందా?

స) అవును. ఇప్పటి వరకూ అంతా హ్యాపీగానే సాగిపోతోంది. నా టాలెంట్ ని నిరూపించుకోవడానికి సుబ్బారావు పాత్ర బాగా హెల్ప్ అవుతుందని నేను బాగా నమ్ముతున్నాను.

ప్రశ్న) ఇప్పటివరకూ మీ జర్నీలో బాగా చిరాకు పుట్టించే సందర్భం ఏమన్నా ఉందా?

స) లేదండి. లక్కీగా ఇప్పటి వరకు అలా చిరాకు పుట్టించే సందర్భాని పేస్ చెయ్యలేదు.

ప్రశ్న) ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా యాక్టర్ అవ్వడం కష్టమా?

స) నా పర్సనల్ గా చూసుకుంటే కష్టమైనదే అని చెప్పుకోవాలి. కానీ ఎప్పుడైతే మీకు యాక్టర్ కావాలనే తాపత్రయం ఉంటుందో ప్రయత్నాన్ని ఆపకండి. కానీ మీదగ్గర క్లారిటీ ఉండాలి. నీకు నటుడు కావాలని బలంగా అనుకుంటే అదేమీ అంత పెద్ద కష్టం కాదు.

ప్రశ్న) మీ సినిమాలపై ఫ్యామిలీ ఎలా స్పందించింది?

స) నా కుటుంబం సినిమాలను పెద్దగా ఎంజాయ్ చెయ్యదు. ‘సినిమాలకి వెళ్తే పాడైపోతాడు అనే ఫీలింగ్ లో ఉంటారు’. నేను నా సొంత నిరనయంతో ఇక్కడికి వచ్చాను.

ప్రశ్న) డైరెక్టర్ కిషోర్ తిరుమలపై మీ అభిప్రాయం చెప్పండి?

స) పూరి జగన్నాథ్ – శేఖర్ కమ్ములని మిక్స్ చేస్తే కిషోర్ తిరుమల. ఆయన ఎంచుకునే పాత్రలు శేఖర్ కమ్ముల సినిమాలోలా చాలా నమ్మశక్యంగా , రియలిస్టిక్ గా ఉంటాయి. కానీ తను రాసే డైలాగ్స్, పాత్రల ట్రీట్ మెంట్ పూరి జగన్నాథ్ స్టైల్ కి దగ్గరగా ఉంటాయి.

ప్రశ్న) మీరు ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు?

స) నేను చాలా సినిమాలు చూస్తాను, అలాగే వాటిని విశ్లేషించడానికి ట్రై చేస్తాను. అలాగే నా ప్లే స్టేషన్ 3కి కాస్త సమయం కేటాయిస్తాను. సినిమాలు, గేమ్స్, టెక్నాలజీ ఈ మూడు నాకు బాగా ఇష్టమైనవి.

ప్రశ్న) మీకు ఎలాంటి తరహా సినిమాలంటే ఇష్టం?

స) నాకు ‘అనుకోకుండా ఒక రోజు’ లాంటి థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం. థ్రిల్లర్ సినిమాల్లో ఎక్కువ హర్రర్, వయొలెన్స్ ఉండదు. అలాగే నాకు నాకు కామెడీ అంటే ఇష్టం.

ప్రశ్న) మీరు చేస్తున్న తదుపరి సినిమాలేమిటి?

స) ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నాను. అలాగే నారా రోహిత్ నిర్మిస్తున్న ‘మారియో’ సినిమాలో కూడా కనిపించనున్నాను. ప్రస్తుతం అయితే సెకండ్ హ్యాండ్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత క్లారిటీ వస్తుంది, అలాగే నేను ఎంచుకోబోయే పాత్రల మీద మరింత కేర్ తీసుకోవాలి.

ప్రశ్న) మీకేమన్నా డ్రీం ప్రాజెక్ట్స్ / రోల్స్/ ఈ కాంబినేషన్లో పనిచేయాలని ఉందా?

స) నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వర్క్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో నటించడం అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దొరకడం ఓ అదృష్టం. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. నేను ఆయన ప్రతి ఇంటర్వ్యూ ఫాలో అవుతాను. ఒక విషయం గురించి బాగా ఫిలాసపీ తో మాట్లాడడంలో బాగా ఒక అరుదైన వ్యక్తి త్రివిక్రమ్.

ప్రశ్న) మా పాఠకులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?

స) తెలుగు ప్రేక్షకులకి హాస్యం మీద మంచి పట్టుంది. ‘మన తెలుగు సినిమాలో కామెడీకి ఉన్నంత సపోర్ట్ మరెక్కడా ఉండదు’. వాళ్ళు సెకండ్ హ్యాండ్ సినిమాని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది క్లాస్ కంటెంట్ ఉన్న మాస్ సినిమా.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించాం. సెకండ్ హ్యాండ్ సినిమాతో కిరీటికి మంచి గుర్తింపు రావాలని కోరుకుందాం..

ఇంటర్వ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం : రాఘవ

తాజా వార్తలు