ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న చందమామ కధలు సినిమా ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతుంది. మార్చ్ మధ్యలో ఈ సినిమాను విడుదల చేద్దాం అనుకున్నా కొన్ని కారణాల వలన ఈ చిత్ర నిర్మాతలు ఆఖరి నిముషంలో సినిమా విడుదలను వాయిదా వేసారు
ఈ సినిమాలో చైతన్య కృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, అభిజీత్, షామిలి, ఇషా, కిషోర్ మరియు రిచా పనై ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతదర్శకుడు. 8 విభిన్న కధల మిశ్రమంగా వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కింది. నరేష్, ఆమని జంటగా నటిస్తుంటే, లక్ష్మి మంచు ఎక్స్ మోడల్ పాత్ర పోషిస్తుంది. పెళ్లి కోసం ఎదురుచూసే పాత్రలో కృష్ణుడు కనిపించనున్నాడు
వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను చాణుక్య నిర్మిస్తున్నాడు