యు/ఏ సర్టిఫికేట్ పొందిన ‘రేసు గుర్రం’

యు/ఏ సర్టిఫికేట్ పొందిన ‘రేసు గుర్రం’

Published on Apr 4, 2014 10:00 PM IST

race-gurram
అల్లు అర్జున్ శృతి హాసన్ జంటగా నటించిన ‘రేసు గుర్రం’ సెన్సార్ పనుల్ని పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు కాగా సినిమా మొత్తం వినోదాత్మకంగా వుందని సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్ల మలుపు బుజ్జి డా వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్రం ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరుగుతుంది. తన గర్ల్ ఫ్రెండ్ ని తన అన్నయ్య ఆట పట్టించినప్పుడు హీరో ఎలా స్పందిస్తాడు అనేదే ఈ చిత్ర కధాంశం. భోజ్ పూరి నటుడు రవి కిషన్ విలన్ పాత్ర పోషిస్తుండగా సలోని ఇంకో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బ్రహ్మానందం పోషించిన పోలీస్ పాత్ర ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రధాన ఆకర్షణ కానుందని సమాచారం.

థమన్ సంగీతం అందించగా మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది.

తాజా వార్తలు