భారీ అంచనాలతో వస్తున్న ‘రౌడీ’

భారీ అంచనాలతో వస్తున్న ‘రౌడీ’

Published on Apr 3, 2014 7:20 PM IST

Rowdy
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, మంచు విష్ణు హీరోలుగా నటించిన ‘రౌడీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 4న అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో అత్యధిక థియేటర్స్ లో భారీ అంచనాల నడుమ విడుదలవుతోంది.

ట్రైలర్స్ లో ఇచ్చిన మోహన్ బాబు నాచురల్ లుక్, విష్ణు పెర్ఫార్మన్స్ వల్ల ఈ సినిమాకి క్రేజ్ పెరిగిపోయింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో సెంటిమెంట్ కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

విష్ణు స్నేహితులు నిర్మించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు. ‘రౌడీ’ సినిమా రామ్ గోపాల్ వర్మకి కం బ్యాక్ మూవీ అవుతుందని ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి అంచనా వేస్తున్నారు. మరి సినిమా రేంజ్ ఏంటనేది తేలాలంటే రేపటి వరకూ వేచి చూడాల్సిందే..

తాజా వార్తలు