సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు హీరోగా నటించిన ‘హృదయ కాలేయం’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టికెట్స్ కి క్రేజ్ భారీగా ఉందనే చెప్పాలి. రేపు ప్రసాద్ ఐమాక్స్ లోని కొన్ని షోస్ కి సంబందించిన టికెట్స్ ఒక్కరోజులో అమ్ముడుపోయాయి. ఈ విషయం అందరినీ షాకింగ్ కి గురిచేసింది.
సోషల్ మీడియాతో హీరోగా పేరు తెచ్చుకున్న ఈ ‘హృదయ కాలేయం’ సినిమా పెద్ద హిట్ అయితే సినిమా విజయంలో ప్రమోషన్స్ అనేవి ఎంత ప్రధాన పాత్ర పోషిస్తాయి అనేది మీకు తెలుస్తుంది. స్టీవెన్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సాయి రాజేష్ నిర్మాత. కావ్య కుమార్, ఇషిక సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సెటైరికల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.